ఆన్‌లైన్‌లో నవోదయ హాల్‌టికెట్లు | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో నవోదయ హాల్‌టికెట్లు

Oct 30 2026 7:30 AM | Updated on Oct 30 2026 7:30 AM

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

వచ్చే నెల 28న ఎంట్రెన్స్‌ పరీక్ష

వర్గల్‌(గజ్వేల్‌): సిద్దిపేట జిల్లా వర్గల్‌ నవోదయలో 2027–28 విద్యాసంవత్సరం 6వ తరగతిలో ప్రవేశానికి ఎంపిక పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్‌ సీబీఎస్‌ఈఐటీఎంఎస్‌.ఆర్‌సీఐఎల్‌.జీఓవీ.ఇన్‌ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని విద్యాలయ ప్రిన్సిపాల్‌ దాసి రాజేందర్‌ పేర్కొన్నారు. నవంబర్‌ 28న ప్రవేశ పరీక్ష జరుగుతుందని, అభ్యర్థులు పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్‌ నెంబర్‌తో హాల్‌ టికెట్లను డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చన్నారు.

మతిస్థిమితం లేని

వృద్ధురాలి అదృశ్యం

సంగారెడ్డి క్రైమ్‌: మతిస్థిమితం లేని ఒక వృద్ధురాలు అదృశ్యమైన సంఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ రామునాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి పట్టణంలోని కల్వకుంట కాలనీకి చెందిన ఆబేదా బేగం (70) తన కుటుంబంతో కలిసి నివాసముంటోంది. కాగా, ఆమె కొంతకాలంగా మతిస్థిమితం లేక బాధపడుతోంది. ఈ క్రమంలో ఈ నెల 29న గురువారం ఉదయం అదే కాలనీలో నివసిస్తున్న బంధువుల ఇంటికి వెళ్లిన ఆబేదా బేగం తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతా ల్లో, తెలిసినవారు, బంధువుల ఇళ్ల వద్ద గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసు కుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.

బైక్‌ అదుపు తప్పి వ్యక్తి మృతి

సంగారెడ్డి క్రైమ్‌: సంగారెడ్డి పట్టణ పరిధిలో బైక్‌ అదుపు తప్పి, అనుమానాస్పద స్థితిలో ఓ భవన నిర్మాణ కూలీ దారుణంగా మృతి చెందాడు. పట్టణ సీఐ రామానాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కి చెందిన సుధీర్‌ మహతోవ్‌ (30) గత మూడేళ్లుగా కంది మండలం చిమ్నాపూర్‌లోని మధుకర్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం చిమ్నాపూర్‌ నుంచి సంగారెడ్డి పట్టణానికి పాల వ్యాపారం నిమిత్తం వచ్చాడు. పని ముగించుకుని తిరిగి ఫామ్‌హౌస్‌కు బైక్‌పై బయలుదేరిన సుధీర్‌, కల్వకుంట శివారులోకి రాగానే బైక్‌ అదుపు తప్పి పక్కనే ఉన్న కాల్వలో పడి అనుమానాస్పద స్థితిలో శవమై తేలాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫామ్‌హౌస్‌ యజమాని మధుకర్‌రెడ్డి సహకారంతో మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో బీహార్‌లోని స్వగ్రామానికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

వ్యక్తికి గాయాలు

చేర్యాల(సిద్దిపేట): పట్టణ శివారులో విద్యు త్‌ స్తంభంపై ఎలక్ట్రికల్‌ పని చేస్తున్న కొలిపాక ప్రశాంత్‌ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు స్తంభంపై నుంచి జారి కింద పడ్డాడు. ఈ ఘటన లో గాయపడిన అతడిని వెంటనే స్థానికులు 108లో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా రు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కో సం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ..

రామాయంపేట(మెదక్‌): భార్య ఆపరేషన్‌ కోసం అప్పుగా తెచ్చి ఇంట్లో దాచిన నగదుతో పాటు బంగారు ఆభరణాలను గుర్తుతెలియని దుండగుడు అపహరించిన ఘటన బుధవారం అర్ధరాత్రి రామాయంపేట పట్టణంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. పట్టణంలోని చిత్తరమ్మ ఆలయంలో పని చేస్తున్న సత్యనారాయణ కుటుంబంతో కలిసి ఆలయ సమీపంలో నివాసం ఉంటున్నా డు. తన భార్య ఆపరేషన్‌ నిమిత్తం రూ.81 వే లు అప్పుగా తెచ్చి ఇంట్లో దాచాడు. ఇంట్లో ఎవ రూ లేని సమయంలో ముసుగు ధరించిన గుర్తుతెలియని వ్యక్తి తాళాలు పగులగొట్టి నగ దు, బంగారు ఆభరణాలను అపహరించాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యాలాల: బైక్‌ను సిమెంటు ట్యాంకర్‌ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని దౌలాపూర్‌ సమీపంలో బుధవారం జరిగింది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని పగిడియాల చెందిన సతీష్‌(23) పని నిమిత్తం కొడంగల్‌కు వెళ్లి బైక్‌పై తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో దౌలాపూర్‌ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న సిమెంటు ట్యాంకర్‌ ఢీకొంది. ఈ ఘటనలో సతీష్‌ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement