అప్పులబాధలో రైతు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అప్పులబాధలో రైతు ఆత్మహత్య

Oct 30 2026 7:30 AM | Updated on Oct 30 2026 7:30 AM

హవేళిఘణాపూర్‌(మెదక్‌): పంట సాగు కోసం బోర్లు వేసి అప్పులు అధికం కావడంతో ఓ రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్‌ మండల పరిధిలోని రాజ్‌పల్లి గ్రామంలో చోసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొండి సామేల్‌(60), తనకు ఉన్న మూడెకరాల పొలంలో 15 బోర్లు వేశాడు. అయినా చుక్క నీరు రాకపోవడంతో రూ.12లక్షల వరకు అప్పులయ్యాయని, అవి ఎలా తీర్చాలో తెలియక మంగళవారం రాత్రి ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే అతనిని మెదక్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. మృతుడికి భార్య శ్యామల, ఇద్దరు కుమారులు ఉన్నారు.

15 బోర్లు వేసినా దక్కని నీరు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement