అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు | - | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు

Oct 30 2026 7:30 AM | Updated on Oct 30 2026 7:30 AM

ఆభరణాలు స్వాధీనం

మెదక్‌జోన్‌: బస్సులో ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టును నిజాంపేట పోలీసులు రట్టు చేశారు. సరూర్‌నగర్‌కు చెందిన మేకల సంధ్యను అరెస్ట్‌ చేసి, 25 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నా రు. నల్గొండకు చెందిన సూరం స్నేహ ఆగస్టు 26న రాఖీ పండుగ సందర్భంగా 30 తులాల బంగారు ఆభరణాలతో నిజాంపేటలోని తన తల్లి ఇంటికి బయలుదేరింది. అక్కడికి చేరుకున్న తర్వాత బ్యాగులో నగలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి సంధ్యను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ విష యం వెలుగులోకి వచ్చిందని ఎస్పీ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. సంధ్య తన తల్లి సతుపాటి రాధికతో పాటు బంధువులు అక్షింతల సంధ్య, బండి మోజెస్‌, బండి దుర్గతో కలిసి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ ద్వారా సంభాషించేవారని, హైదరాబాద్‌, కర్నూలు, విజయవాడ, రాజమండ్రి, నిజామాబాద్‌, మెదక్‌ ప్రాంతాల్లోని బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో చోరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

నిందితురాలి నుంచి నాలుగు బంగారు చైన్లు, నాలుగు లాకెట్లు, ఒక పుస్తెల తాడు, 13 ఉంగరాలు, ఒక ప్లాటినం ఉంగరంతో పాటు నల్లపూసల దండలు, కంకణాలు, గాజు లు, కమ్మలు, చంపస్వరాలు, ముక్కెర, సిక పువ్వు తదితర ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఇతర నిందితులను అరెస్ట్‌ చేసి, మిగతా సొత్తును స్వాధీనం చేసుకుంటామని ఎస్పీ తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన రామా యంపేట సీఐ సైదా, ఎస్‌ఐలు రాజేష్‌, బాలరాజ్‌, ఐటీ కోర్‌ సిబ్బంది విజయ్‌, వెంకట్‌, మహేందర్‌తో పాటు ఇతర పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్‌ కుమార్‌, తూప్రాన్‌ డీఎస్పీ నరేందర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

కి‘లేడీ’ అరెస్ట్‌..

25 తులాల బంగారం స్వాధీనం

వివరాలు వెల్లడించిన ఎస్పీ శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement