పటాన్‌చెరు టౌన్: పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు ఎఫ్‌టీఎల్ ప్రాంతంలో మట్టి పోసి ఆక్రమణకు యత్నిస్తున్నారన్న ఫిర్యాదుతో హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. సుమారు 3.5 ఎకరాల విస్తీర్ణాన్ని పరిశీలించిన అధికారులు.. చెరువు భూమికి రక్షణగా కంచె ఏర్పాటు చేసేందుకు మంగళవారం వచ్చారు. అయితే కంచె ఏర్పాటు చేసేందుకు వచ్చిన హైడ్రా అధికారులను స్థానిక నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అధికారులతో వాగ్వాదానికి దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం హైడ్రా అధికారులు ఎఫ్‌టీఎల్ ప్రాంతంలో కంచె ఏర్పాటు చేసే పనులను చేపట్టారు. చెరువు భూములను పరిరక్షించేందుకు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
హైడ్రా అధికారులను అడ్డుకున్న వారిని
పీఎస్‌కు తరలింపు


