నర్సాపూర్: సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాథమిక సర్వేయింగ్ సూత్రాలపై బలమైన పట్టు సాధించాలని జాకబ్స్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక బీవీ రాజు ఇంజనీరింగ్ కాలేజీలో ప్రారంభమైన విష్ణు జాతీయ స్థాయి సర్వేయింగ్ పోటీలు –2026 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సర్వేయింగ్‌లో కచ్చితత్వం, నమ్మకం, బాధ్యత అత్యంత కీలకమన్నారు. సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు నేషనల్ హైవే అథారిటీలో అందుబాటులో ఉన్న ఇంటర్న్‌షిప్ అవకాశాల గూర్చి నేషనల్ హైవే అఽథారిటీ ఆఫ్ ఇండియా గజ్వేల్ ప్రాజెక్టు డైరెక్టర్ మాధవి వివరించారు. పోటీల్లో 27 కాలేజీలకు చెందిన 56 విద్యార్థుల బృందాలు పాల్గొన్నాయి. ఈ కార్య క్రమంలో శ్రీవిష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్‌చైర్మన్ రాజగోపాల్, కాలేజీ డైరెక్టర్ లక్ష్మిప్రసాద్, ప్రిన్సిపాల్ సంజయ్‌దూబె, హెచ్‌ఓడీ కృష్ణారావు, మేనేజర్ బాపిరాజు, ఏఓ సురేశ్ పాల్గొన్నారు.


