ప్రిన్సిపాల్‌, సిబ్బందిపై ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

ప్రిన్సిపాల్‌, సిబ్బందిపై ఫిర్యాదు

Sep 30 2026 7:42 AM | Updated on Sep 30 2026 7:42 AM

ప్రిన్సిపాల్‌, సిబ్బందిపై ఫిర్యాదు హత్నూర(సంగారెడ్డి): హత్నూర గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్‌, సిబ్బందితో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని అదనపు కలెక్టర్‌ పాండుకు మంగళవారం విద్యార్థులు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో విద్యార్థులకు జ్వరాలు వచ్చినా కూడా.. ప్రిన్సిపాల్‌తో పాటు సిబ్బంది పట్టించుకోవడం లేదని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోయారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు ప్రిన్సిపాల్‌ సిబ్బంది తీరు మారేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు పోలీసులపై దురుసు ప్రవర్తన లైన్‌మెన్‌పై దాడి

సిద్దిపేటజోన్‌:తండ్రికి తలకొరివి పెట్టి కూతురు రుణం తీర్చుకుంది. జిల్లా కేంద్రంలో సోమవారం గుండెపోటుతో మహేశ్‌ మృతి చెందాడు. కాగా ఆయనకు కూతురు కల్యాణి ఉంది. కుమారులు లేకపోవడంతో తండ్రి అంత్య క్రి యలు మంగళవారం కూతురు నిర్వహించింది. ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.

సంగారెడి క్రైమ్‌: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.ఈ ఘటన సంగారెడ్డి ప్టటణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సంగారెడ్డి పట్టణంలోని రెవెన్యూ కాలనీకి చెందిన మహమ్మద్‌ (23)తన బైక్‌పై బైపాస్‌ నుంచి రెవెన్యూ కాలనీకి వెళ్తున్నాడు. ఈ క్రమంలో స్థానిక ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద కారు అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

ఎనిమిది మందిపై కేసు

తూప్రాన్‌: శాంతిభద్రతలను పరిరక్షించేందుకు వెళ్లిన పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, వారిపై దురుసుగా ప్రవర్తించిన ఎనిమిది మందిపై కేసు నమోదైంది. ఎస్‌ఐ గంగరాజు వివరాల ప్రకారం.. మండలంలోని వెంకటాపూర్‌ గ్రామం నుంచి డయల్‌ 100కు కాల్‌ వచ్చింది. దీంతో పోలీస్‌ సిబ్బంది తక్షణమే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన జంగం నవీన్‌, తొంట సతీశ్‌, తొంట అనిల్‌, గోలిపల్లి వెంకట్‌ రెడ్డి, గోలిపల్లి రాజా రెడ్డి, తొంట గణేశ్‌, జంగం కిరణ్‌, బుర్ర వంశీగౌడ్‌ తీవ్రంగా మద్యం తాగి ఉన్నారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని చూసి సదరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తిస్తూ, దుర్భాషలాడారు. విధులను నిర్వర్తించకుండా అడ్డుకుంటూ ఆటంకం కలిగించారు. దీంతో పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించి, విధులకు ఆటంకం కలిగించినందుకు ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులకు ఫిర్యాదు

పటాన్‌చెరు టౌన్‌: విద్యుత్‌ బకాయిలు చెల్లించాలని కోరిన లైన్‌మెన్‌పై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, లైన్‌న్‌మెన్‌ వివరాల ప్రకారం.. ఇంద్రేశం మున్సిపల్‌ పరిధిలోని సిటిజన్‌ కాలనీకి చెందిన జయప్రసాద్‌ ప్రస్తుతం పటాన్‌చెరు టౌన్‌ సెక్షన్‌లో లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యా హ్నం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాయి రాం కాలనీలోని విద్యుత్‌ బకాయి ఉన్న ఇంటికి వెళ్లాడు. ప్లాట్‌ నంబర్‌ 302లో అద్దెకు ఉంటున్న మహ్మద్‌ సమీర్‌ను రూ.9330 బకాయి బిల్లు చెల్లించాలని కోరగా.. ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తూ దురుసుగా మాట్లాడాడు. ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో సమీర్‌, జయప్రసాద్‌ ముఖంపై చేతితో దాడి చేసి, దుర్భాషలాడాడు. తనపై దాడి చేసి, విధులకు ఆటంకం కలిగించాడని జయప్రసాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement