భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య

Sep 30 2026 7:42 AM | Updated on Sep 30 2026 7:42 AM

చిన్నశంకరంపేట(మెదక్‌): కుటుంబ కలహాల నేపథ్యంలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని సూరారం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ రెండో కుమారుడు మహేశ్‌(22) భార్యతో కలిసి చేగుంటలో పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే భార్యతో గొడవపడి సోమవారం రాత్రి సూరారానికి వచ్చాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్లేవరకు చూసి యువకుడు ఇంట్లో ఉరివేసుకున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేశారు.

బెట్టింగులో డబ్బులు పోగొట్టుకొని..

జిన్నారం (పటాన్‌చెరు): బెట్టింగులో డబ్బులు పోగొట్టుకుని మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుమ్మడిదల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై అరుణ్‌ కుమార్‌ వివరాల ప్రకారం... గుమ్మడిదల పట్టణ పరిధిలోని బొంతపల్లికి చెందిన సత్తారపు శ్రీకాంత్‌ (23) మూడు నెలల క్రితం ఆన్‌లైన్‌ బెట్టింగులో రూ.9 లక్షలు పోగొట్టుకున్నాడు. దీంతో అప్పటి నుంచి మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం ఉదయం తన బెడ్రూమ్‌లో ఉరివేసుకున్నాడు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement