చిన్నకోడూరు(సిద్దిపేట): గంజాయి తాగుతూ ముగ్గురు యువకులు పోలీసులకు చిక్కారు. చిన్నకోడూరు ఎస్సై చంద్రమోహన్ వివరాల ప్రకారం.. ఇబ్రహీంనగర్ శివారులోని ఓ కాటన్ మిల్ వద్ద ముగ్గురు యువకులు గంజాయి తాగుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి చేశారు. ముగ్గురు యువకులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో సిద్దిపేట పట్టణం భారత్‌నగర్‌కు చెందిన గుండం విష్ణువర్ధన్‌రెడ్డి (23), నర్సాపూర్‌కు చెందిన అంబటి లక్ష్మినరసింహ (21), ఇబ్రహీంనగర్ గ్రామానికి చెందిన చేకూర్తి మల్లికార్జున్ (22) ఉన్నారు. వారి వద్ద నుంచి 5.5 గ్రాముల గంజాయిని, రెండు ఫోన్లు, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.


