చిత్తుబొత్తు స్థావరంపై దాడి | - | Sakshi
Sakshi News home page

చిత్తుబొత్తు స్థావరంపై దాడి

Sep 30 2026 7:42 AM | Updated on Sep 30 2026 7:42 AM

చిత్తుబొత్తు స్థావరంపై దాడి ఇద్దరు అదృశ్యం కేబుల్‌ వైర్‌ చోరీ చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని చర్లఅంకిరెడ్డిపల్లి, అనంతసాగర్‌ గ్రామాల్లో సోమవారం రాత్రి పొలాల వద్ద స్టార్టర్‌ల నుంచి బోరు మోటారుకు మధ్యగల కేబుల్‌ వైర్‌ను దుండగులు చోరీ చేశారు. ఆయా గ్రామాల్లో పది మంది రైతులకు చెందిన బోరు మోటార్ల వద్ద చోరీ జరిగినట్లు తెలిపారు. రైతులు మంగళవారం వ్యవసాయ పొలాల వద్దకు వచ్చి చూడగా.. స్టార్టర్‌ నుంచి బోరు మోటారుకు మధ్యగల కేబుల్‌ వైర్‌ను కత్తిరించి తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఈ విషయమై రెండు గ్రామాల రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రమోహన్‌ తెలిపారు.

ఆరుగురి అరెస్ట్‌

వట్‌పల్లి(అందోల్‌): చిత్తుబొత్తు ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేసి ఆరుగురిని పట్టుకున్నారు. ఈ ఘటన సోమవారం రాత్రి మండల పరిధిలోని మర్వెళ్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఎస్సై లక్ష్మికాంతరెడ్డి కథనం ప్రకారం.. గ్రామ శివారులో కొందరు వ్యక్తులు చిత్తుబొత్తు ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం వచ్చింది. ఈ మేరకు సిబ్బందితో కలిసి దాడి చేయగా శివానంద్‌(బిజిలీపూర్‌), ఇందూరి సురేశ్‌(దేవునూర్‌), వి.గోపాల్‌ (మంచిర్యాల తండా), ఆగమయ్య(పాలడుగు), గోపాల్‌(పెద్దతండా), యేసు (మర్వెళ్లి) పట్డుబడగా, ఆంజనేయులు, సుభాష్‌ పరారయ్యారు. వారి వద్ద నుంచి రూ.రూ.10 వేల నగదుతో పాటు మూడు సెల్‌ఫోన్లు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పటాన్‌చెరు టౌన్‌: వివాహిత అదృశ్యమైన ఘటన పటాన్‌చెరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈశ్వర్‌ భార్య మాన్సీతో కలిసి బతుకుదెరువు కోసం నాలుగేళ్ల క్రితం వచ్చి ఇంద్రేశం మున్సిపల్‌ పరిధిలోని నవ్య తులసిలో ఉంటున్నారు. భార్యాభర్తలిద్దరూ మేసీ్త్ర పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 23న రాత్రి మాన్సీ(28) చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. ఫోన్‌ చేస్తే స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. భర్త ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

మరో చోట కేన్సర్‌ రోగి..

నాంపల్లి: చికిత్స కోసం వచ్చిన ఓ రోగి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా చేగుంట అంబాజీపేటకు చెందిన నరసయ్య (70) కేన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం ఎంఎన్‌జే ఆసుపత్రికి వచ్చాడు. చికిత్స ఆలస్యం కావడంతో సమీపంలోని ఎన్జీవో సంస్థ నడుపుతున్న అప్నాఘర్‌ లో ఉంటున్నాడు. రోగి వెంట వచ్చిన బంధువులు స్వగ్రామం వెళ్లి వచ్చి చూసేసరికి షెల్టర్‌ లో కనిపించలేదు. దీంతో బంధువులు సమీపంలోని అన్ని ప్రాంతాల్లో వెతికినా కనిపించలేదు. కోడలు రోహిణి నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement