సంగారెడ్డి: మాజీ మంత్రి హరీశ్‌రావును బీఆర్‌ఎస్‌వీ నాయకుడు అఖిల్ మట్టి వినాయక విగ్రహాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించాలని అఖిల్ పేర్కొన్నారు. మట్టి వినాయక విగ్రహాన్ని స్వీకరించిన హరీశ్‌రావు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు.
కల్హేర్(నారాయణఖేడ్): క్రీడలు విద్యార్థుల్లో మానసిక ప్రశాంతతకు దోహదపడుతాయని ప్రోబేషనరీ డిప్యూటీ కలెక్టర్ కె.లక్ష్మి దీపిక తెలిపారు. సిర్గాపూర్‌లో మండలస్థాయి బాలుర ఎస్‌జీఎఫ్ క్రీడలను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఆటలతో ఆరోగ్యంగా ఉంటూ చదువుల్లో రాణించాలని ఆకాంక్షించారు.


