ప్రజలకు మెరుగైన వైద్యసేవలు | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు

Sep 10 2026 8:47 AM | Updated on Sep 10 2026 8:47 AM

డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ధనరాజ్‌

డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ధనరాజ్‌

సిద్దిపేటకమాన్‌: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ధనరాజ్‌ తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని బస్తీ దవాఖాన, ఫైలేరియా యూనిట్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సెంటర్‌కు వచ్చే వారి నుంచి సేకరించిన రక్త నమునాలను ఎప్పటికప్పుడు సేకరించి తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్‌కు పంపించాలని సూచించారు. ఆరోగ్య కార్యక్రమాల పనితీరు మెరుగుపర్చుకోవాలని, పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని సూచించారు. సిబ్బంది సమయ పాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానిత కేసులను స్క్రీనింగ్‌ చేసి, వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే చికిత్స అందించాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్‌ ఎంటమాలజిస్ట్‌, ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీకాంత్‌ యాదవ్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement