జహీరాబాద్‌లో రైతు సదస్సు
జహీరాబాద్ టౌన్ : గ్రామీణ వ్యవసాయ పని అనుభవ కార్యక్రమంలో భాగంగా డీడీఎస్ కేవీకే ఆధ్వర్యంలో శ్రీరైతు సదస్సుశ్రీ నిర్వహించారు. మల్లారెడ్డి వ్యవసాయ కళాశాల విద్యార్థులు, శాస్త్రవేత్తలు రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వ్యవసాయ అధికారి కె.శివ ప్రసాద్ మాట్లాడుతూ.. రైతులు శాసీ్త్రయ పద్ధతులు, నాణ్యమైన సాంకేతికతను జోడించి పంట దిగుబడితో పాటు ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. మల్లారెడ్డి వ్యవసాయ పాఠశాల డీన్ డాక్టర్ రాజారెడ్డి, ఫ్యాకల్టీ సభ్యులు, బసంత్‌పూర్ శాస్త్రవేత్త శ్రీమతి జి.విజయలక్ష్మి, కేవీకే శాస్త్రవేత్తలు నేల ఆరోగ్యం, సమగ్ర పోషక యాజమాన్యం, తెగుళ్ల నియంత్రణ, నీటి సంరక్షణపై సూచనలు చేశారు. నారింజ రైతు మిత్ర ప్రతినిధులు పాల్గొని, రైతులు సమష్టిగా పంటలను మార్కెటింగ్ చేస్తూ మెరుగైన మద్దతు ధర పొందే మార్గాలను వివరించారు.


