బాలల కథల పుస్తకం ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

బాలల కథల పుస్తకం ఆవిష్కరణ

Sep 10 2026 8:47 AM | Updated on Sep 10 2026 8:47 AM

సిద్దిపేటఅర్బన్‌: బాలల లోకంలో విహరించిన కథలు ఎల్లకాలం నిలుస్తాయని కథాశిల్పి ఐత చంద్రయ్య పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట అర్బన్‌ మండలం బక్రిచెప్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు రచించిన కథల పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలకు చెందిన 36 మంది విద్యార్థులు రచించిన కథలను ముద్రించడం గొప్ప విషయమని వక్తలు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ నరేశ్‌, ప్రధానోపాధ్యాయుడు నాగేందర్‌రెడ్డి, కవులు ఉండ్రాళ్ల రాజేశం, వరుకోలు లక్ష్మయ్య, ఎన్నవెళ్లి రాజమౌళి, పెందోట వెంకటేశ్వర్లు, భైతి దుర్గయ్య, ఎడ్ల లక్ష్మి, మాధవీలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement