నానో ఎరువుల వాడకంపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

నానో ఎరువుల వాడకంపై అవగాహన

Sep 10 2026 8:47 AM | Updated on Sep 10 2026 8:47 AM

నానో ఎరువుల వాడకంపై అవగాహన

రైతులకు అవగాహన కల్పిస్తున్న శాస్త్రవేత్తలు, అధికారి

సిద్దిపేటఅర్బన్‌: నానో ఎరువుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేట అర్బన్‌ మండలం పొన్నాల మధిర భట్టి రామన్నపల్లి గ్రామంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఏటీఎంఏ) సిద్దిపేట ఆధ్వర్యంలో వరి పంటలో నానో ఎరువుల వాడకంపై బుధవారం క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. అలాగే పత్తి పంటలోఅంతర పంటగా కంది సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త పల్లవితో కలిసి మండల వ్యవసాయ అధికారి శ్రీనాథ్‌ రైతులకు నానో యూరియా, నానో డీఏపీ, లింగాకర్షణ బుట్టలు, వేప నూనెలను అందజేశారు. వీటి వాడకం, ఉపయోగాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తోర్నాల శాస్త్రవేతలు, సర్పంచ్‌ వెంకటయ్య , ఉప సర్పంచ్‌ సృజన, సంపత్‌ , ఏఈఓ మీరా, వార్డు మెంబర్‌ గోపి, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement