వేర్వేరు చోట్ల గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు చోట్ల గంజాయి పట్టివేత

Sep 10 2026 8:47 AM | Updated on Sep 10 2026 8:47 AM

ముగ్గురు అరెస్ట్‌

ముగ్గురు అరెస్ట్‌

పటాన్‌చెరు టౌన్‌: అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పటాన్‌చెరు ఎకై ్సజ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎకై ్సజ్‌ సీఐ శ్రవణ్‌ కుమార్‌ వివరాల ప్రకారం.. పటాన్‌చెరు ఎకై ్సజ్‌ పోలీస్‌ బృందం అమీన్‌పూర్‌ ప్రాంతంలో మంగళవారం రాత్రి తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అతడి వద్ద గంజాయి లభించింది. పట్టుబడిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌, కర్నూలు జిల్లాకు చెందిన రాజేశ్‌గా గుర్తించారు. అతడి వద్ద నుంచి 1.76 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించనున్నట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎకై ్సజ్‌ ఎస్‌ఐలు షేక్‌ ఫయాజుద్దీన్‌, స్వప్న, సిబ్బంది పాల్గొన్నారు.

ఇస్నాపూర్‌లో 2.8 కిలోలు..

గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరిని ఎస్‌ఓటీ, పటాన్‌చెరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇస్నాపూర్‌లోని మహేశ్వర కాలేజీకి వెళ్లే రోడ్డులో మంగళవారం రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో గంజాయి సరఫరా చేస్తున్న సంగారెడ్డి మామిడిపల్లికి చెందిన గణపతి, సదాశివపేట గొల్లగూడెంకు చెందిన మల్లేశంను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2.8 కిలోల గంజాయి, బుల్లెట్‌ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement