అష్టాదశ శక్తి పీఠం దేవాలయ చైర్మన్
కొండపాక(గజ్వేల్): ఆధ్యాత్మికత, సేవా దృక్పథానికి కొండపాక ప్రాంతం భవిష్యత్తులో నిలయంగా మారనుందని అష్టాదశ శక్తి పీఠం దేవాలయ చైర్మన్, ప్రభుత్వ మాజీ సలహాదారు కే.వీ రమణాచారి పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో మహిమాన్వితమైన దేవతామూర్తుల దర్శనం ఒకే చోట లభించేలా ఉమా రామలింగేశ్వర సహిత అష్టాదశ శక్తి పీఠం దేవాలయాన్ని నిర్మించామన్నారు. బుధవారం దేవాలయ ఆవరణలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రి చైర్మన్ బొల్లినేని కృష్ణయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అష్టాదశ శక్తి పీఠం దేవాలయం దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ వ్యాప్తంగా వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని నిత్యాన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో ఆనంద నిలయం చైర్‌పర్సన్ లత, వికలాంగుల సేవా సంస్థ చైర్మన్ వంశీ రాధాకృష్ణ, కొండలరావు, ట్రస్టు చైర్మన్ నాగరాజు, రిటైర్టు డిప్యూటీ డీఈఓ వైకుంఠం, సర్పంచ్ నవీన పాల్గొన్నారు.


