నడిరోడ్డుపై పాముల కలకలం | - | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై పాముల కలకలం

Sep 10 2026 8:41 AM | Updated on Sep 10 2026 8:41 AM

నడిరోడ్డుపై పాముల కలకలం బాల సదన్‌ ఆకస్మిక తనిఖీ

కల్హేర్‌(నారాయణఖేడ్‌): నిజాంపేట్‌ మండల కేంద్రం సమీపంలో సంగారెడ్డి–నాందేడ్‌ 161 జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి పాములు కలకలం రేపాయి. వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. రహదారిపైకి కొండచిలువ, ఇతర పాములు వస్తున్నాయని వాహనదారులు తెలిపారు.

సంగారెడ్డి టౌన్‌: పట్టణంలోని బాల సదన్‌ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అలాగే పిల్లల సంరక్షణ, భద్రతతో పాటు హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె సూచించారు. అనంతరం అక్కడి పిల్లలతో ముచ్చటించి, వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. బాల సదన్‌లో అందుతున్న భోజనం, తాగునీటి సదుపాయాలు, పరిసరాలను పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పిల్లలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

కొమురవెల్లి రైల్వేస్టేషన్‌లో అదనపు ప్లాట్‌ఫాం

రూ. 40 కోట్లతో నిర్మాణం

కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న రైల్వేస్టేషన్‌లో రూ. 40 కోట్లతో అదనపు ప్లాట్‌ ఫాం నిర్మించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధి కారి పద్మజ వెల్లడించారు. బుధవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకు లు, అఽధికారులు స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం మరో రెండు రైళ్లను పెంచాలని వినతిపత్రం అందించారు. ఆమె మాట్లాడుతూ మనోహరాబాద్‌ నుంచి కొత్తపల్లి వరకు చేపడుతున్న రైల్వే లైన్‌ పనులు పూర్తయితే టెంపుల్‌ కారిడార్‌ ఏర్పాటు అవుతుందన్నారు. 24 గంటలూ భక్తులకు రైల్వే సిబ్బంది స్టేషన్‌లో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు.

మల్బరీ సాగుతో సిరులు

రాష్ట్ర పట్టు పరిశ్రమశాఖ జేడీ లత

తొగుట(దుబ్బాక): మల్బరీ సాగు చేసిన రైతుల ఇంట సిరుల పంట పండుతుందని రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ లత అన్నారు. మండలంలోని పెద్దమాసాన్‌పల్లి రైతు వేదికలో ‘నాపట్టు.. నా అభిమానం’ కార్యక్రమంలో భాగంగా బుధవారం అవగాహ న సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జేడీ హాజరై మాట్లాడారు. పట్టుగూళ్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉందన్నారు. మల్బరీ సాగు చేసిన రైతులకు ప్రభుత్వం అన్నివిధాల ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ఎల్‌ని నో ప్రభావంతో వర్షాలు కురిసే పరిస్థితి లేనందన రైతులు సాగుకు ముందురావాలన్నారు. మిగితా పంటల మాదిరిగా పంట పెట్టుబడి ఖర్చులు అంతగా ఉండవన్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలు సాగుచేసే దిశగా రైతులు ఆలోచించాలని ఆమె కోరారు. అనంతరం శాస్త్రవేత్తలు మల్లికార్జున్‌, రాఘవేంద్ర మల్బరీ సాగుపై రైతులకు ఆవగాహన కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement