నల్లవాగు ఆయకట్టుకు నీరందించాలి | - | Sakshi
Sakshi News home page

నల్లవాగు ఆయకట్టుకు నీరందించాలి

Sep 9 2026 12:03 PM | Updated on Sep 9 2026 12:03 PM

మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డిడిమాండ్‌

మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డిడిమాండ్‌

కల్హేర్‌(నారాయణఖేడ్‌): జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టు నల్లవాగు చివరి ఆయకట్టు కింద ఎండుతున్న పంటలు కాపాడేందుకు సాగు నీరు అందించేంతవరకు పోరాటం చేస్తామని ఖేడ్‌ మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం మండలంలోని ఖానాపూర్‌(కె)లో భూపాల్‌రెడ్డిను కల్హేర్‌ ఎస్‌ఐ రవిగౌడ్‌ ఆధ్వర్యంలో గృహ నిర్బంధం చేశారు. నీటి సరఫరా చేయాలని కలెక్టరేట్‌కు బయల్దేరుతుండగా పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని మండిపడ్డారు. వర్షాలతో నల్లవాగు ప్రాజెక్టు నిండినా ప్రభుత్వం, పాలకుల నిర్లక్ష్యంతో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. నల్లవాగు కాల్వల్లో పిచ్చి మొక్కలు, పూడిక నిండటంతో చివరి ఆయకట్టు వరకు నీరు చేరడంలేదని తెలిపారు. ప్రజల తరఫున మాట్లాడితే గొంతు నొక్కేందుకు నిరంకుశ పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రామ్‌సింగ్‌, నాయకులు ఉప్పరి మోహన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement