డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి
సంగారెడ్డి: రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడమే ఏకై క లక్ష్యంగా ప్రతీ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి పిలుపునిచ్చారు. సంగారెడ్డి పట్టణంలో మంగళవారం జరిగిన ఆదివాసీ కాంగ్రెస్ జిల్లా కమిటీ ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన సంఘటన్ సజన్ కార్యక్రమంలో ఆమె పాల్గొ మాట్లాడా రు. స్వాతంత్య్రం రాకముందునుంచి దేశ ప్రజలకు సేవ చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. స్వర్గీయ ఇందిరాగాంధీ ఆదివాసీలకు ప్రత్యేక గుర్తింపు నిచ్చారని గుర్తు చేశారు. కార్యక్రమానికి హాజరైన ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర వైస్ చైర్మన్ లింగం నాయక్ మాట్లాడుతూ... ఆదివాసీలు, యానాదులు, చెంచులు మొదటినుంచి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతీ గిరిజనుడికి గుర్తింపునిచ్చేందుకు సంఘటన్ సజన్ అభియాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు జిల్లా కమిటీ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, జిల్లా అధ్యక్షుడు రామ్‌చందర్ నాయక్, ఇన్‌చార్జ్ కిషన్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జార్జ్, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


