జీపీ కార్యదర్శిపై చర్యలు తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

జీపీ కార్యదర్శిపై చర్యలు తీసుకోండి

Sep 9 2026 12:03 PM | Updated on Sep 9 2026 12:03 PM

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోన్న మండల పరిధిలోని మిర్జాపూర్‌(ఎన్‌) గ్రామ పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం ఆ గ్రామ పంచాయతీ పాలక వర్గం సభ్యులు జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశారు. గ్రామంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల కోసం గ్రామ పంచాయతీ నిధులను డ్రా చేయాలంటే సర్పంచ్‌తోపాటు ఉప సర్పంచ్‌ సంతకాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై న అక్కమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో అధికారులు ఉప సర్పంచ్‌గా ఉన్న శ్రీకాంత్‌రెడ్డికి సర్పంచ్‌ బాధ్యతలను అప్పగించారు. గ్రామ పంచాయతీ నిధుల డ్రాకు సంబంధించి మరో సభ్యుని సంతకం అవసరం కాగా పాలక వర్గం సభ్యులు వార్డు సభ్యుడు జగన్‌ను ఎన్నుకున్నారు. కానీ పంచాయతీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ మాత్రం గత ఆరు నెలలుగా తమ సంతకం లేకుండానే ఆయన సంతకం పెట్టి నిధులు డ్రా చేస్తున్నారని వార్డు సభ్యులు జగన్‌ తదితరులు ఆరోపించారు. టీఎస్‌ బీపాస్‌ అకౌంట్‌ నుంచి తమకు తెలియకుండానే నిధులు డ్రా చేస్తున్న ఈ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని వారు డీపీఓకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement