బ్రెస్ట్‌ ఫీడింగ్‌ గదిని సద్వినియోగం చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

బ్రెస్ట్‌ ఫీడింగ్‌ గదిని సద్వినియోగం చేసుకోండి

Sep 9 2026 12:03 PM | Updated on Sep 9 2026 12:03 PM

జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారి

జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారి

నారాయణఖేడ్‌: ఖేడ్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో ఏర్పాటుచేసిన మదర్‌ బ్రెస్ట్‌ ఫీడింగ్‌ గదిని తల్లులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారి సూచించారు. ఖేడ్‌ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన గదిని మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రయాణ సమయంలో తల్లులు తమచిన్నారులకు బహిరంగ ప్రదేశాల్లో పాలుపట్టేందుకు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేశామన్నారు. తల్లిపాలు శిశువులకు అత్యంత శ్రేష్టమైన పోషకాహారంతోపాటు ఎదుగుదలకు ఎంతో కీలకమని చెప్పారు. అనంతరం కేజీబీవీలో బాలికలకు శానిటరీ ప్యాడ్స్‌ పంపిణీ చేశారు. ఆవరణలో మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో ఖేడ్‌ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, ఆర్టీసీ డీఎం సుబ్రహ్మణ్యం, సీడీపీఓ సుజాత, జిల్లా మహిళా సాధికారిత కేంద్రం సమన్వయకర్త పల్లవి, సఖి సమన్వయకర్త కల్పన, వైద్యాధికారి తరణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement