భద్రత ప్రమాణాలే ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

భద్రత ప్రమాణాలే ముఖ్యం

Sep 9 2026 12:03 PM | Updated on Sep 9 2026 12:03 PM

జిన్నారం (పటాన్‌చెరు): పరిశ్రమల యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మంగళవారం బొల్లారం పారిశ్రామికవాడలోని సీఐ సుధీర్‌కుమార్‌ ఆధ్వర్యంలో పరిశ్రమల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామికవాడలో భద్రత ప్రమాణాల విషయంలో పరిశ్రమల సహకారం అందించాలని సూచించారు. పరిశ్రమల్లో భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు వాటి పర్యవేక్షణకు యాజమాన్యాలు బాధ్యత వహించాలన్నారు. అలాగే పరిశ్రమల్లో విధులు నిర్వహించే కార్మికుల వ్యక్తిగత వివరాలు సేకరణకు సంబంధించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పరిశ్రమల అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆనందరావు, కార్యదర్శి రాయుడు, ఇతర పరిశ్రమల ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.

డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement