ఆయుధాలు, బైక్ స్వాధీనం
జహీరాబాద్ టౌన్ : కత్తితో దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం జహీరాబాద్ రూరల్ ఎస్సై రాజేందర్ రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 6న దిడ్గి గ్రామానికి చెందిన సయ్యద్ అస్లాం(33), జుబేర్ అదే గ్రామానికి చెందిన నీరటి రాజుతో గొడవపడ్డారు. అడ్డుకోబోయిన నీరటి ప్రశాంత్, నీరటి యశ్వంత్‌ను బెదిరిస్తూ అస్లాం కత్తితో, జుబేర్ ఇనుప రాడ్‌తో వారిపై దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం రాత్రి అల్గోల్ చౌరస్తాలో మెహఫిల్ హోటల్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దాడికి ఉపయోగించిన కత్తి, ఇనుప రాడ్, పల్సర్ బైక్, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చిరాకుపల్లి ఎస్సై వినయ్ కుమార్ తదితరులు ఉన్నారు.


