నంగునూరు(సిద్దిపేట): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరణాన్ని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మంగళవారం రాజగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షుడు లింగంగౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టారీతిగా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రమేశ్‌గౌడ్, తిరుపతి, సిద్దు, స్వామి, వెంకటేశ్వర్లు, అనిల్ పాల్గొన్నారు.
అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని గౌరవెల్లి గ్రామంలో ఇటీవల నిర్వహించిన పాఠశాల క్రీడా సమాఖ్య మండలస్థాయి క్రీడా పోటీల్లో కట్కూర్ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు ప్రతిభ కనబరించారు. కాగా వాలీబాల్ సీనియర్ బాలుర విభాగంలో ప్రథమ , ఖోఖో సీనియర్ బాలికల విభాగంలో ద్వితీయ, ఖోఖో జూనియర్ బాలికల విభాగంలో ద్వితీయ, కబడ్డీ సీనియర్ బాలుర విభాగంలో వరుసగా మూడో ఏడాది ప్రథమ బహుమతి సాధించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. దీంతో సర్పంచ్ బాలరాజు, ప్రధానోపాధ్యాయులు సీహెచ్.రఘ విద్యార్థులను అభినందించారు.
వ్యక్తికి 5 ఏళ్ల జైలు, జరిమానా
సంగారెడ్డి: గంజాయి అక్రమ రవాణా కేసులో నేరం రుజువు కావడంతో ఓ వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.25 వేల జరిమానా విధిస్తూ జిల్లా అదనపు న్యాయ అధికారి జయంతి సోమవారం తీర్పు వెలువరించారు. ప్రోహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారుల వివరాల ప్రకారం.. నిందితుడు బీరంగూడకు చెందిన మాలపాటి కరుణాకర్ రెడ్డి అక్రమంగా గంజాయి రవాణా చేస్తుండగా అప్పట్లో ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలను కోర్టుకు సమర్పించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన అనంతరం నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడికి శిక్ష విధించారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన ఎకై ్సజ్ అధికారులను, సిబ్బందిని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ చంద్రయ్య, అసిస్టెంట్ కమిషనర్ గాయత్రి, జిల్లా ఎకై ్సజ్ అధికారి శ్రీనివాసరావు అభినందించారు.
యువకుడి పరిస్థితి విషమం
నర్సాపూర్ రూరల్ : రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలో మంగళవారం నర్సాపూర్ – మెదక్ జాతీయ రహదారిలోని రెడ్‌ఫోర్ట్ హోటల్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎర్ల నవీన్ బైక్‌పై నర్సాపూర్ వస్తుండగా గుర్తుతెలియని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నవీన్‌కు తీవ్ర గాయాలవగా కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా అతడి పరిస్థితి విషమంగా ఉంది.
చేర్యాల(సిద్దిపేట): పుట్టుకతో మలద్వారం లేకుండా జన్మించిన దూడకు స్థానిక ప్రాంతీయ పశువైద్యశాలలో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి కృత్రిమ మలద్వారం ఏర్పాటు చేశారు. చేర్యాలకు చెందిన రావుల శంకర్‌గౌడ్‌కు చెందిన దూడ పుట్టుకతోనే మలద్వారం లేకపోవడంతో పశువైద్యులను సంప్రదించారు. ఈ మేరకు ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకులు డా.జంగ రాజిరెడ్డి ఆధ్వర్యంలో దూడకు ‘సీకోస్టమి’ శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ శస్త్రచికిత్సలో భాగంగా దూడ కుడివైపు పొట్టభాగంలో కృత్రిమ మలద్వారాన్ని ఏర్పాటు చేశారు. దీంతో దూడకు మల విసర్జనకు మార్గం ఏర్పడింది. ఈ అరుదైన శస్త్రచికిత్సలో జేవీఓ మనోహర్‌తో పాటు సిబ్బంది బాలమణి పాల్గొన్నారు.


