నష్టపోవద్దనే బంతి సాగు
ఆరుతడి కింద సేద్యం చేస్తున్న రైతులు
కొల్చారం(నర్సాపూర్): ఒకే రకమైన నీటి ఆధారిత పంటలు సాగు చేసి నష్టపోకుండా ఉండేందుకు, ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలన్న అధికారుల సూచనల మేరకు రైతులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా సంగాయిపేట గ్రామ శివారులో గ్రామానికి చెందిన తుంగని సత్తయ్య బోరు బావిలో పుష్కలంగా నీరున్నా.. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నీటి ఆధారిత పంట వరి సాగు చేస్తున్నాడు. కాగా నష్టపోవద్దన్న అధికారుల సూచనలతో ఆరుతడి కింద బంతితోటను సాగు చేస్తున్నాడు. ఎకరంలో బంతి సాగు చేస్తూ నీటిని పొదుపుగా వాడుతున్నాడు. తద్వారా ఒక పంట దెబ్బతిన్న మరో పంట ఆదుకుంటుందని ఆ రైతు భిప్రాయపడ్డాడు.
మొదటి బోరు కింద వరి పంట సాగు చేశాను. ఎకరం పొలం ఊరికే వదిలేశాను. వరికి నీరు ప్రస్తుతం పుష్కలంగా అందిస్తుంది. ఊరికే వదిలేసిన ఎకరంలో ఆరుతడి పంట కింద బంతి సాగు చేసా. పంటకు నీటి వినియోగం కూడా తక్కువే. వచ్చేది పండుగల సీజన్, బంతి సాగు ఎంతో కొంత ఆర్థికంగా ఆదుకుంటుందన్న నమ్మకం ఉంది.
– తుంగని సత్తయ్య, రైతు, సంగాయిపేట.


