ఆధార్‌కార్డే ఆధారమైంది.. | - | Sakshi
Sakshi News home page

ఆధార్‌కార్డే ఆధారమైంది..

Sep 9 2026 12:03 PM | Updated on Sep 9 2026 12:03 PM

మెదక్‌ కలెక్టరేట్‌: పదకొండేళ్ల క్రితం తప్పిపోయిన మతిస్థిమితం లేని అమ్మాయికి ఆధార్‌కార్డే ఆధారమై తల్లిదండ్రుల చెంతకు చేర్చింది. ఈ ఘటన మెదక్‌ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ అధికారి హేమభార్గవి కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మునుగోడు మండలానికి చెందిన మతిస్థిమితం లేని బాలిక 11 ఏళ్లున్నప్పుడు 2014లో ఇంటి నుంచి తప్పిపోయింది. హైదరాబాద్‌లో దొరకడంతో అధికారులు మెదక్‌ జిల్లా శివ్వంపేటలో గల బేతాని సంరక్షణ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు. ఆమెకు ఆధార్‌కార్డు లేకపోవడంతో వివరాలు నమోదు చేయించేందుకు పలుమార్లు ప్రయత్నం చేయగా రిజక్ట్‌ అయ్యింది. దీంతో ఇటీవల ఆమెను మాదాపూర్‌లోని ఆధార్‌ సెంటర్‌కు తీసుకెళ్లగా అప్పటికే నమోదైన ఆధార్‌ నెంబర్‌ వచ్చిందని తెలిపారు. దాని ఆధారంగా తల్లిదండ్రుల ఆచూకీ లభించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆమె వయస్సు 23ఏళ్లు కాగా తల్లిదండ్రులను పిలిపించి ఆమెను అప్పగించారు. ఈ విషయంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది నాగరాజు, శ్రీనివాస్‌, సరిత, మంజుల, బేతాని ఆశ్రమ సోషల్‌ వర్కర్‌ వీరబాబ పాల్గొన్నారు.

11ఏళ్ల తరువాత

తల్లిదండ్రుల చెంతకు చేరిన అమ్మాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement