ఎరువులు మోతాదు మించొద్దు | - | Sakshi
Sakshi News home page

ఎరువులు మోతాదు మించొద్దు

Sep 7 2026 7:39 AM | Updated on Sep 7 2026 7:39 AM

రాయికోడ్‌(అందోల్‌): ఎరువులు, రసాయనాలు మోతాదుకు మించకుండా రైతులు జాగ్రత్తలు పాటించాలని మండల వ్యవసాయ అధికారి సారిక అన్నారు. మండలంలోని శంశోద్దీన్‌పూర్‌లో అయిల్‌పామ్‌ పంటలో అంతర పంటగా సాగు చేసిన మినుము పంటను వ్యవసాయశాఖ అధికారులు ఆదివారం పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు మినుము పంటలో మొక్కల ఎదుగుదల, పూత, ఆశించిన దిగుబడి పొందేందుకు నేల స్వభావానికి తగ్గట్లుగా సమతుల్య ఎరువులను వినియోగించాలన్నారు. ఆధునిక పోషక యాజమాన్య పద్ధతులను అవలంభించాలని సూచించారు. నానో డీఏపీ, యూరియాను రైతులకు అందించి, వాటితో కలిగే ప్రయోజనాపై అవగాహన కల్పించారు. నీటి యాజమాన్యం, కలుపు నివారణ మార్గా లను వివరించారు. అంతర పంటల సాగుతో రైతు లు ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే అవకాశాలుంటాయని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది మమత, రమేశ్‌ రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement