రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Sep 7 2026 7:39 AM | Updated on Sep 7 2026 7:39 AM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కౌడిపల్లి(నర్సాపూర్‌): రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం ఎస్‌ఐ అమరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మహమ్మద్‌నగర్‌ గ్రామానికి చెందిన దర్జి దుర్గేశ్‌(40) శనివారం రాత్రి పనిపై కౌడిపల్లికి బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో కౌడిపల్లిలోని ఐఓసీ పెట్రోల్‌పంప్‌ సమీపంలో 765డి జాతీయ రహదారిపై వెనుక నుంచి వేగంగా వచ్చిన అంబులెన్స్‌ ఢీకొట్టగా తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతన్ని హైదరాబాద్‌ సూరారంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య అనురాధ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కారు,బైక్‌ ఢీకొని ఒకరికి త్రీవ గాయాలు

అక్కన్నపేట(హుస్నాబాద్‌): కారు, బైక్‌ ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని కేశనాయక్‌తండా గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ పరిధిలోని చెరువు ముందు తండాకు చెందిన బానోతు భాస్కర్‌ తండా నుంచి రామవరం గ్రామ వైపు బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన కారు అతడి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో భాస్కర్‌కు తల భాగం, భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడ్ని హుస్నాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు భాస్కర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement