యూరియా బుకింగ్‌ సమస్యలు పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

యూరియా బుకింగ్‌ సమస్యలు పరిష్కరించండి

Sep 6 2026 8:31 AM | Updated on Sep 6 2026 8:31 AM

యూరియా బుకింగ్‌ సమస్యలు పరిష్కరించండి

మెదక్‌ కలెక్టరేట్‌: యూరియా బుకింగ్‌ యాప్‌లో సాంకేతిక సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ అధికారులతో శనివారం గూగుల్‌ మీట్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ...జిల్లాలో పంట నమోదు మరింత వేగంవంతంగా నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న వాలంటీర్‌ ద్వారా మాత్రమే ఈ కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు. రైతుల నమోదు జిల్లా లో 75 శాతం పూర్తి అయిందన్నారు. అంతకు ముందు జిల్లాలో పారిశ్రామిక కారిడార్‌ కోసం భూసేకరణపై ఆర్డీఓలు, తహశీల్దార్లతో గూగుల్‌ మీట్‌ నిర్వహించారు. జిల్లాలోని తూప్రాన్‌, మనోహరాబాద్‌, చేగుంట, మాసాయిపేట, మెదక్‌ మరియు శంకరంపేట మండలాల్లో పారిశ్రామిక కారిడార్‌ కోసం తగిన భూసేకరణ చేపట్టాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్‌ కుమార్‌, వినయ్‌, వందన, వ్యవసాయ, ఆర్‌డీఓఎస్‌, టీజీఐఐసీ తదితర శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ప్రతిమా సింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement