హత్నూర(సంగారెడ్డి): హత్నూర మండలం దౌల్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితం బోధిస్తున్న కీర్తి చంద్రిక రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ప్రభుత్వం గుర్తించి అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉందని కీర్తి చంద్రిక అన్నారు. రాష్ట్రస్థాయి అవార్డు రావడం మరింత బాధ్యతను పెంచిందని మరింత ప్రయోగాలు చేసి విద్యార్థులకు గుణాత్మకమైన గణిత బోధన చేస్తానని తెలిపారు.
న్యాయమూర్తి సుచరిత
అల్లాదుర్గం(మెదక్): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు అల్లాదుర్గంలో ఈ నెల 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించనున్నట్లు జూనియర్ సివిల్ జడ్జ్ సుచరిత వెల్లడించారు. అల్లాదుర్గం కోర్టులో పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె ఈ జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజీ కుదుర్చుకోవడానికి కక్షిదారులకు లోక్ అదాలత్ ఉపయోగపడుతుందన్నారు. కోర్టు పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు కక్షిదారులకు సహకారాలు అందించాలన్నారు.
టీపీసీసీ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సంగారెడ్డి: కొన్నేళ్ల క్రితం సంగారెడ్డిలో ఐబీ గెస్ట్ హౌస్ నుంచి బసవేశ్వర విగ్రహం వరకు అంతా ఖాళీగా ఉండేదని అప్పట్లో రూ.80లక్షలతో బీటీ రోడ్డు వేయించాననని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు రూ.18కోట్లతో బైపాస్ రోడ్డు విస్తరణ పనులు చేయిస్తున్నానని ఆయన మీడియాకు తెలిపారు. బైపాస్ రోడ్డును అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి అనుమతి కోరడంతో ఆయన ఓకే చెప్పడంతో పనులు కూడా చకచకా కొనసాగుతున్నాయన్నారు. రోడ్డు ఆల స్యం అవుతుందని విమర్శలు వస్తున్నా యని అయితే చెట్లకు ఇబ్బంది లేకుండా, విద్యుత్ సరఫరా ఆగిపోకుండా, వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా రోడ్డును విస్తరిస్తున్నామంటే ఆషామాషీ వ్యవహారం కాదని వివరించారు.


