మంత్రి పొంగులేటిని బర్తరఫ్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

మంత్రి పొంగులేటిని బర్తరఫ్‌ చేయాలి

Sep 6 2026 8:25 AM | Updated on Sep 6 2026 8:25 AM

జిన్నారం (పటాన్‌చెరు): రైతులను నట్టేట ముంచడమే కాకుండా వారి భూములను నిషేధిత జాబితాలో చేర్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని వెంటనే పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌డ్డి డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ రైతులతో కలిసి శనివారం గుమ్మడిదల పట్టణ కేంద్రంలో రైతు పోరుబాట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసపూరిత హామీలతో గద్దెనెక్కి రైతులను హరిగోస పెడుతుందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చ లేదన్నారు. ఎరువుల దుకాణాల్లో, యాప్‌లో కూడా యూరియా దొరకని దుస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం వెంటనే రైతు సమస్యలను పరిష్కరించాలని లేదా రైతుల పక్షాన బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటానికి సిద్ధమవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, నియోజకవర్గ కోఆర్డినేటర్‌ ఆదర్శ్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ కుమార్‌ గౌడ్‌, సీనియర్‌ నాయకులు గోవర్ధన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement