సంగారెడ్డి ఎడ్యుకేషన్: విద్యార్థులు తమ హక్కులు, బాధ్యతలు, రాజ్యాంగ విలువలు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జూనియర్ సివిల్ జడ్జి కమ్ స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి దుర్గారాణి స్పష్టం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా దుర్వినియోగం, వ్యక్తిగత సమాచార భద్రత వంటి అంశాలపై విద్యార్థులకు ఆమె అవగాహన కల్పించారు. తెలియని వ్యక్తులతో ఆన్‌లైన్‌లో వ్యక్తిగత వివరాలు పంచుకోకూడదని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకూడదని, సైబర్ నేరాలకు గురైనప్పుడు వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి దుర్గారాణి


