కల్హేర్(నారాయణఖేడ్): వేలాడుతున్న కరెంట్ తీగలకు కర్రలు ఏర్పాటు చేసి స్తంభాలుగా మార్చడంతో ట్రాన్స్‌కో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. కర్రలను తొలగించి కొత్తగా విద్యుత్ స్తంభం ఏర్పాటు చేశారు. ‘కర్రలే విద్యుత్ స్తంభాలు’శీర్షికతో ఈ నెల 4న ‘సాక్షి’లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. నిజాంపేట్ మండలం మునిగేపల్లి శివారులో నారాయణఖేడ్ మార్గంలో 161బీ జాతీయ రహదారి పక్కన మూలమలుపు వద్ద వ్యవసాయ విద్యుత్‌లైన్ తీగలు బాగ కిందకు వేలాడుతున్నాయి. దీంతో ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో రైతులు తాత్కాలికంగా కర్రలు ఏర్పాటు చేశారు. ప్రమాదంతో పొంచి ఉండటంతో అధికారులు తక్షణమే కర్రలు తొలగించారు. కొత్తగా విద్యుత్ స్తంభం ఏర్పాటు చేశారు. విద్యుత్ లైన్‌లో కిందికి వేలాడుతున్న తీగలను సరిచేశారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
కర్రలు తొలగించి స్తంభం ఏర్పాటు


