పుల్‌కల్(అందోల్): విద్యార్థులకు ముత్యాల్లాంటి అక్షరాలు రాయడానికి తెలుగు ఉపాధ్యాయుడు కృషి చేస్తున్నాడు. మండల కేంద్రం పుల్‌కల్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాస్‌చారి అక్షరాల రూపకల్పనకు కృషి చేస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాడు. తాను విధులు నిర్వర్తిస్తున్న పాఠశాలలోనే కాకుండా తోటి ఉపాధ్యాయులు బోధించే పాఠశాలల్లో సైతం సెలవు రోజుల్లో విద్యార్థులకు మంచి రాత కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 68 ఉన్నత పాఠశాల్లో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణిత అక్షరాలపై చక్కటి రాత రాయడానికి విద్యార్థులకు ప్రత్యేక మెలకువలు బోధించాడు. 2024లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయనను జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా పభ్రుత్వం ఎంపిక చేసి సన్మానించింది. యూట్యూబ్‌లో సైతం చక్కటి అక్షరాల మెలకువలు నేర్పుతున్నాడు.


