పాఠాలు చెప్పి..
చిలప్‌చెడ్(నర్సాపూర్): విద్యార్థి పాఠశాలకు రాకపోతే.. ఉపాధ్యాయుడే వెతుక్కుంటూ వెళ్లి తీసుకొస్తాడు. మండల పరిధిలోని చండూర్ ఉన్నత పాఠశాలకు ఈ మధ్యే పదోన్నతిపై దాండిగ రమేశ్ వచ్చాడు. సమయపాలన, క్రమశిక్షణకు పెట్టింది పేరు. ముందుగా ఆయన పాఠశాలలోని అన్ని తరగతులలో హాజరుశాతం పరిశీలించి, పాఠశాలకు రాని విద్యార్థుల ఇంటికి స్వయంగా వెళ్తారు. ఎందుకు బడికి రాలేదో, వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకుంటారు. కారణం లేకుండా ఇంటి వద్ద ఉన్న విద్యార్థులను బడికి తీసుకువస్తారు. దీంతో విద్యార్థుల హాజరుశాతం పెరిగింది. ఉపాధ్యాయుడి తీరుపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదువుతోనే బంగారు భవిష్యత్ సాధ్యమని, తల్లితండ్రులు పిల్లల చదువును నిర్లక్ష్యం చేయొద్దని చెబుతున్నారు,


