నమూనా ఎన్నికలు.. ప్రజాస్వామ్యంపై.. | - | Sakshi
Sakshi News home page

నమూనా ఎన్నికలు.. ప్రజాస్వామ్యంపై..

Sep 5 2026 7:25 AM | Updated on Sep 5 2026 7:25 AM

నమూనా ఎన్నికలు.. ప్రజాస్వామ్యంపై..

చేగుంట(తూప్రాన్‌): మండల కేంద్రమైన చేగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాల సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు లక్ష్మణ్‌ విద్యార్థులకు క్షేత్ర స్థాయి సందర్శనతో పాఠాలు బోధిస్తున్నారు. గ్రామ పంచాయతీని సందర్శించి సచివాలయ పరిపాలన, రేషన్‌ షాపులను సందర్శించి ప్రజాపంపిణీ వ్యవస్థ, పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించి శాంతిభద్రతల పరిరక్షణ, విద్యార్థులతో నమూనా ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. గత సంవత్సరం రాజ్యాంగ పరిషత్‌లోని సభ్యుల వివరాలతో గ్యాలరీని ఏర్పాటు చేయించారు. పలు అంశాల్లో విద్యార్థులకు ప్రత్యక్ష బోధన అందిస్తూ.. పలువురి మన్ననలు అందుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement