తూప్రాన్: రైలు ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన పట్టణ పరిధిలోని బ్రాహ్మణపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. కామారెడ్డి రైల్వే పోలీసుల వివరాలు..బ్రాహ్మణపల్లికి చెందిన గుర్రం బాలేశ్(35) గ్రామ సమీపంలోని ఓ తోటలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రాత్రి రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న రైలు ఢీకొట్టగా మృతి చెందాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.


