రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Sep 5 2026 7:25 AM | Updated on Sep 5 2026 7:25 AM

నిజాంపేట(మెదక్‌): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన మండల పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాందేడ్‌ జిల్లాకు చెందిన గణేశ్‌(21), నిర్మల్‌కు చెందిన పవార్‌ అనిల్‌ అలియాస్‌ వినోద్‌(37) కలిసి ద్విచక్ర వాహనంపై నిర్మల్‌ నుంచి కొమురవెల్లికి బయలుదేరారు. కాగా నందిగామ శివారులోని నిర్మాణంలో ఉన్న వంతెన సమీపానికి చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న స్పీడ్‌ బ్రేకర్‌ను అధిక వేగం కారణంగా గమనించకపోవడంతో వాహనం అదుపుతప్పి వంతెనపై నుంచి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరి తలలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరు లేకపోవడంతో ఉదయం అటుగా వెళ్లిన ప్రయాణికులు గమనించి పోలీసులకు చెప్పారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామ శివారులోని కుంగిన బ్రిడ్జి వద్ద రోడ్డు సరిగా కనిపించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పలువురు వాహనదారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement