వినూత్న బోధన..ప్రతిభను వెలికితీస్తూ.. | - | Sakshi
Sakshi News home page

వినూత్న బోధన..ప్రతిభను వెలికితీస్తూ..

Sep 5 2026 7:25 AM | Updated on Sep 5 2026 7:25 AM

వినూత్న బోధన..ప్రతిభను వెలికితీస్తూ..

నారాయణఖేడ్‌: ఒకప్పుడు ప్రైవేట్‌ పాఠశాలకు వరుస కట్టిన విద్యార్థులు.. ఉపాధ్యాయుడు చేసిన కృషి, బోధనా తీరుకు ఆకర్శితులై సర్కారు బడికి వస్తున్నారు. మండలంలోని సంజీవన్‌రావుపేట ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీ ఉపాధ్యాయుడు సుదర్శన్‌ వడ్ల విద్యార్థులకు కృత్యాదార విధానంలో బోధన , ఆకర్శణీయమైన బోధనాభ్యాసన సామగ్రిని వినియోగిస్తున్నారు. దీంతో విద్యార్థులు సాధిస్తున్న ప్రగతిని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు చేరేలా కృషి చేస్తున్నారు. బడిబాట వంటి అనేక కార్యక్రమాలు చేపట్టడంతో 2024–25లో 92 మంది ఉన్న సంఖ్య రెండేళ్లలో 175కు చేరింది. పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా ఆటలు, లైబ్రరీ, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా కృషి చేస్తున్నారు. రూమ్‌ టు రీడ్‌ ఇండియా స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement