జాతీయస్థాయి పోటీలకు విద్యార్థిని ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి పోటీలకు విద్యార్థిని ఎంపిక

Sep 4 2026 7:29 AM | Updated on Sep 4 2026 7:29 AM

జాతీయస్థాయి పోటీలకు విద్యార్థిని ఎంపిక

మెదక్‌జోన్‌: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో మెదక్‌ డిగ్రీ కళాశాల విద్యార్థిని అంజలి బంగారు పతకం సాధించి జాతీయస్థాయి క్రీడలకు ఎంపికై ందని కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ హుస్సేన్‌ తెలిపారు. మంగళవారం కళాశాలలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నెల 26, 27వ తేదీల్లో హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో 12వ తెలంగాణ సౌత్‌ జోన్‌ అండర్‌ – 20 జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌న్‌ షిప్‌ పోటీల్లో అంజలి అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికై ందని తెలిపారు. అక్టోబర్‌లో పాండిచ్చేరిలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆడనుందని చెప్పారు. కార్యక్రమంలో లెక్చరర్లు డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌, తిరుమలరెడ్డి, మల్లేశం, పరిపాలన అధికారి అంజాద్‌ అలీ, సూపరింటెండెంట్‌ మల్లికార్జున్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement