జాతి వైరం పక్కన పెట్టి.. | - | Sakshi
Sakshi News home page

జాతి వైరం పక్కన పెట్టి..

Sep 4 2026 7:29 AM | Updated on Sep 4 2026 7:29 AM

జాతి వైరం పక్కన పెట్టి..

నర్సాపూర్‌ రూరల్‌: కుక్కలు వరాహాన్ని వెంటబడి తరమడం, మొరగడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ నర్సాపూర్‌ పట్టణంలోని 15వ వార్డులో కనిపించిన ఓ దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అక్కడ ఓ వరాహం తన పిల్లలతో పాటు కుక్క పిల్లలకు పాలు ఇస్తూ తల్లి ప్రేమను పంచుతోంది. తల్లిని కోల్పోయిన ఆ కుక్క పిల్లలు ఆకలితో అలమటిస్తుండగా, ఆ వరాహం వాటికి పాలు ఇవ్వడం చూసి స్థానికులు ముగ్ధులవుతున్నారు. జాతి భేదం లేకుండా అమ్మ ప్రేమ గొప్పదని ఈ దృశ్యం నిరూపించిందని ప్రజలు చర్చించుకుంటున్నారు.

కుక్కపిల్లకు పాలిచ్చిన వరాహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement