ఎస్‌డబ్ల్యూయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
హుస్నాబాద్: ఆర్టీసీ యూనియన్ ఎన్నికల తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఖాయమని ఎస్‌డబ్ల్యూయూ (ఐఎన్‌టీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కుల మల్లేశం గౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం డిపో యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో ఆర్టీసీ కార్మికులు నరకయాతన అనుభవించారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఉందన్నారు. కార్మికులకు ఒకటో తేదీన జీతాలు, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బాండ్లు, రెండు పీఆర్సీలు చెల్లించిందన్నారు. కొన్ని యూనియన్లు ఆర్టీసీని ముంచడానికే సమ్మెకు వెళ్లాయని ఆరోపించారు. ఐఎన్‌టీయూసీలో చేరిన టీఎంయూ నాయకులను కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ పద్మ, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, యూనియన్ గౌరవ అధ్యక్షుడు శివయ్య, రవీందర్, డిపో యూనియన్ చైర్మన్ ఎం.ఆర్ రెడ్డి, అధ్యక్షుడు కిశోర్‌కుమార్, డిపో కార్యదర్శి పీఎస్ రెడ్డి, నాయకులు మహేందర్ ఉన్నారు.


