జహీరాబాద్ టౌన్: ప్రభుత్వం, కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జిజ్ఞాస’ రాష్ట్ర స్థాయి పోటీల్లో జహీరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థు లు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో విద్యార్థులు తమ ప్రాజెక్ట్ ను ప్రదర్శించారు. హిందీ విభాగాధిపతి డాక్టర్ ఆర్.మదన్ పర్యవేక్షణలో విద్యార్థులు ‘హిందీకి సంవైదానిక్ స్థితి ఔర్ రాజభాష కా సంఘర్ష‘ (హిందీ రాజ్యాంగబద్ధ స్థితి అధికార భాషగా ఎదుర్కొన్న సవాళ్లు) అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. విద్యార్థులు మహమ్మద్ కేఫ్, ఆలియా బేగం, పి.తులసి, జోహ ఏరమ్, నష్రా అంజుం పాల్గొని ప్రశంసాపత్రాలను అందుకున్నారు.
అధ్వానంగా
మధ్యాహ్న భోజనం
అల్లాదుర్గం(మెదక్): ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మధ్యాహ్న భోజనం నాణ్యతగా పెట్టడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. మంగళవారం గోల్లకుంట తండాలోని పాఠశాలలో మెనూ ప్రకారం కూరగాయలతో పాటు, సాంబారు పెట్టాల్సి ఉంది. కానీ పాఠశాలలో కూరగాయ కర్రీ దేవుడెరుగు, నీళ్ల చా రు, ఆలుగడ్డ, టమాటాలు వేసి విద్యార్థులకు వడ్డించారు. హెచ్‌ఎం సైతం పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అధికారులు పర్యవేక్షించి విద్యార్థులకు మెనూతో కూడిన నాణ్యమైన భోజనం అందించాలని కోరుతున్నారు.
ఎండు గంజాయి స్వాధీనం
వ్యక్తి అరెస్ట్
చిన్నశంకరంపేట(మెదక్): ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొని ఎకై ్సజ్ పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసున్నారు. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రామాయంపేట ఎకై ్సజ్ సీఐ నరేందర్ కథనం ప్రకారం.. మంగళవారం మండల కేంద్రంలోని సోమేశ్వరాలయం సమీపంలో అర్జున్ సాహు నుంచి రూ.60 వేల విలువైన 310 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గంజాయి విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
నీట్ ఉచిత శిక్షణకు దరఖాస్తులు
హుస్నాబాద్‌రూరల్: తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి నీట్ లాంగ్ టర్మ్ ఉచిత కోచింగ్‌కు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురుకులాల సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ శ్యామలత మంగళవారం తెలిపారు. హైదరాబాద్‌లోని శిక్షణ కేంద్రాలు టీజీఎస్‌డబ్ల్యూఆర్ ఫౌండేషన్ సీఈఓ చిలుకూరు (బాలురు), మహేంద్ర హిల్స్ ఫౌండేషన్ సీఈఓ (బాలికలకు) 100 సీట్ల చొప్పున ఉన్నాయని పేర్కొన్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియెట్ బైపీసీలో ఉత్తీర్ణులై ఉండాలని, నీట్ 2026లో అర్హత సాధించిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగీరి విద్యార్థులు అర్హులని సూచించారు. వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను పూర్తి చేసి ఈ నెల 22 వరకు హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డలోని సాంఘీక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో పూర్తి ధ్రువపత్రాలతో అందించాలని పేర్కొన్నారు.


