జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్‌రెడ్డి
గజ్వేల్‌రూరల్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి(డీఐఈవో) రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు చెందిన ప్రిన్సిపాల్స్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తూ, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కాగా జిల్లాలోనే అత్యధికంగా అడ్మిషన్లు చేసిన సిద్దిపేట బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రమీలను అభినందించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ జిల్లా అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా హిమబిందు, జాయింట్ సెక్రటరీగా శివకోటి, కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు పలువురు ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.


