జాబితాలో అమీన్‌పూర్
పట్టా భూములు
పటాన్‌చెరు: అమీన్‌ఫూర్ బీరంగూడలోని గ్రీన్‌ఫీల్డ్స్, ప్రణీత్ హోమ్స్, పటేల్ గూడలోని కొన్ని కాలనీల్లో ఇళ్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపివేశారు. దాదాపు ఆ కాలనీలు కొన్నేళ్ల క్రితం వెలిశాయి. అవి కూడా హుడా, హెచ్‌ఎండీఏ వెంచర్లే కానీ ఇప్పుడు అవి ప్రభుత్వ జాగాలో ఉన్నట్లు చెబుతున్నారు. పట్టా భూముల్లో వెంచర్లు ఉన్నా.. వాటి ప్రక్కనే ప్రభుత్వ భూమి ఉందని రిజిస్ట్రేషన్లు నిలిపేస్తున్నారు. అధికారుల నివేదికల మేరకు ప్రొహిబిటెడ్ జాబితాలో కొన్ని ప్రాంతాలను కొత్తగా చేర్చారని, జిల్లా రెవెన్యూ అధికారులిచ్చిన ఆదేశాల మేరకు ఆ ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఆపుతున్నామని చెబుతున్నారు. కానీ, వాస్తవానికి అవి ప్రభుత్వ భూములు కావని చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రైవేటు భూముల్లో వెలసిన ఇళ్లకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ రెండు దశాబ్దాల తర్వాత కొర్రిలు పెట్టడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
క్రయ, విక్రయదారులకు ఇబ్బందులు..
సంగారెడ్డిలోని పటాన్‌చెరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో క్రయ, విక్రయదారులు ప్రతి నిత్యం ఆ శాఖ అధికారులతో వాదనలకు దిగుతున్నారు. కొందరైతే గుట్టు చప్పుడు కాకుండా దళారులను పట్టుకొని రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగితే కొనుగోలు ప్రక్రియకు చేసిన అగ్రిమెంట్లు, బ్యాంకులోన్‌కు ఇబ్బందులు వస్తాయని లంచాలు ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నట్లు సమాచారం. అయితే నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్లు చేసే వీలు లేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కూడా ప్రాహిబిటెడ్ జాబితాలో కొత్తగా పాత వెంచర్లను చేర్చడం విడ్డూరం అంటున్నారు.
రిజిస్ట్రేషన్లకు అడ్డంకులు
20ఏళ్ల క్రితం వెలసిన కాలనీవాసులకు తిప్పలు
శ్రావణ్ అనే వ్యక్తి దశాబ్దం క్రితం ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనుగోలు చేశారు. హెచ్‌ఎండీఏ అనుమతులతో వెలసిన ఆ కాలనీలో కుటుంబంతో ఉంటున్నారు. కాగా బీరంగూడను వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ ఇల్లు మంచి రేటుతో అమ్ముడు పోయింది. కానీ అధికారులు ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని చెబుతున్నారు. మీరు ఉంటున్న కాలనీకి చెందిన భూమి ప్రభుత్వ జాగా అని తేల్చి చెప్పారు. రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్లి ఎన్‌ఓసీ తెస్తేనే రిజిస్ట్రేషన్ చేయడం కుదురుతుందన్నారు. దీంతో ఆయన ఖంగు తిన్నాడు. ఇలా ఒక్క శ్రావణే కాదు అమీన్‌పూర్‌లోని అనేక కాలనీల్లో ఇదే పరిస్థితి ఉంది.


