వర్గల్(గజ్వేల్): విద్యార్థులు బడి దాటి, సమాజాన్ని చదువుతామంటూ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. పాఠ్యపుస్తక విద్యతో పాటు సమాజంపై అవగాహన, చట్టాలపై గౌరవం, పౌర బాధ్యత పెంపొందించాలనే ఉపాధ్యాయుల సూచనల మేరకు శుక్రవారం మండలంలోని తున్కిఖాల్సా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గౌరారం పీఎస్‌ను చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ ఆరోగ్యం విద్యార్థులకు పోలీస్ శాఖ విధులు, ప్రజల భద్రత కోసం సేవలు, చట్టాలు, శిక్షలు, నేరాల నియంత్రలో ప్రజల పాత్ర, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను ఎలా సంప్రదించాలనే అంశాలు వివరించారు. సమాజంలో బాధ్యతాయుతంగా మెలగడం, చట్టాలను గౌరవించడం ఎంత ముఖ్యమో ఈ పర్యటన ద్వారా అవగతమైందని విద్యార్థులు పేర్కొన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, చట్టాలపై అవగాహన పెంపొందించడంలో ఈ పర్యటన దోహదపడుతుందని హెచ్‌ఎం పులి రాజు, టీచర్లు మంజులరెడ్డి, రుక్మిణి, జరీనా, ఫర్హిన్, పూజ పేర్కొన్నారు.
గౌరారం పీఎస్‌లో తున్కిఖాల్సా విద్యార్థులు


