వ్యక్తి అరెస్టు
జహీరాబాద్: విధి నిర్వహణలో ఉన్న వైద్యులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా వారి ఫొటోలు తీసి ఇన్‌స్ట్రాగామ్‌లో, సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్న ఎం.డి చాంద్‌పాషను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఎస్‌ఐ లవకుమార్ కథనం ప్రకారం.. మునిపల్లి మండలం బోడపల్లి గ్రామానికి చెందిన చాంద్‌పాష జహీరాబాద్ పట్టణంలోని మూసానగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. కాగా 12 రోజుల క్రితం అతడు తన భార్యను ఆస్పత్రిలో వైద్యం కోసం అడ్మిట్ చేశాడు. సిబ్బంది తగిన వైద్యం అందించినప్పటికీ చాంద్‌పాష అనవసరంగా వైద్యులను, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, రోగుల ఫొటోలు, వీడియోలు తీస్తూ వారి వ్యక్తిగత జీవితానికి, విధులకు ఆటంకం కల్గించాడు. అంతే కాకుండా వైద్యులు, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించడం లేదని, రోగులకు మందులు సరిగా ఇవ్వడం లేదని అనవసర వ్యాఖ్యలు చేశాడు. అలాగే తాను ఓ పత్రిక జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అని చెప్పుకుంటూ వైద్యుల వద్ద డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ విషయమై వైద్యురాలు, ఆర్‌ఎంఓ ఎం.మానస పోలీసులకు ఫిర్యా దు చేయడంతో కేసు నమోదు చేశారు. శుక్రవారం అతడ్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు.
కల్హేర్(నారాయణఖేడ్): వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. సిర్గాపూర్ ఎస్‌ఐ మహేశ్ వివరాలు.. ఖాజాపూర్‌కు చెందిన వర్ల మహేందర్‌కు పదేళ్ల క్రితం కామారెడ్డి జిల్లా పిట్లం మండలం నాగన్‌పల్లికు చెందిన నాగరాణితో వివాహం జరిగింది. భార్యాభర్తలు కలిసి ఈ నెల 18న పిట్లంలో జరిగిన బంధువుల పెళ్లికి హాజరయ్యారు. నాగరాణి అక్కడి నుంచి పుట్టింటికి వెళ్తానని చెప్పడంతో మహేందర్ ఒక్కడే ఖాజాపూర్ వచ్చాడు. అక్కడి నుంచి వెళ్లిన నాగరాణి ఆచూకీ కనిపించకుండా పోయింది. భర్త మహేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


