వర్షాలు కురవాలని చర్చిలో ప్రార్థనలు | - | Sakshi
Sakshi News home page

వర్షాలు కురవాలని చర్చిలో ప్రార్థనలు

Jul 25 2026 7:21 AM | Updated on Jul 25 2026 7:21 AM

వర్షాలు కురవాలని చర్చిలో ప్రార్థనలు

మెదక్‌జోన్‌: వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మెదక్‌ డయాసిస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్‌ బిషప్‌ కమిషనరీ రెవ. జయానంద్‌ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరికీ శాంతి, సుభిక్షం కలగాలని పరలోక ప్రభువును ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్‌ డయాసిస్‌ సెక్రటరీ దేవ సహాయం, ప్రాపర్టీ కన్వీనర్‌ మంత్రి సొలోమోన్‌, చైర్మన్‌ జార్జి, వైస్‌ చైర్మన్‌ దేవదాస్‌, డయాసిస్‌ గురువులు ప్రేమ్‌కుమార్‌, మెదక్‌ ప్రెసిమెటరీ ఇన్‌చార్జి రెవ.శాంతయ్య, చర్చి సెక్రటరీ గెలన్‌, చిత్తరంజన్‌, సంపత్‌, సుశీల్‌, నోబుల్సన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement