రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

Jul 25 2026 7:21 AM | Updated on Jul 25 2026 7:21 AM

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

అక్కన్నపేట(హుస్నాబాద్‌): రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. ఈ సంఘటన మండలంలోని దుబ్బతండా గ్రామ పరిధిలోని సీతారం తండాలో చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాలు.. గ్రామానికి చెందిన భూక్య పద్మ–సమ్మయ్య దంపతులకు ఏకై క కుమారుడు ఆంజనేయులు(17) బైకుపై కట్కూర్‌ నుంచి మల్లారం వెళ్తున్నాడు. ఈ క్రమంలో కట్కూర్‌ గ్రామంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలో వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న ఇసుక కుప్పను ఢీకొట్టాడు. దీంతో అతడి ముఖానికి తీవ్రస్థాయిలో గాయాలయ్యాయి. వెంటనే హుస్నాబాద్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అయితే, అందరితో కలిసిమెలిసి ఉండే ఆంజనేయులు చిన్న వయస్సులోనే మరణించాడన్న వార్త విన్న తండావాసులు శోకసంద్రంలో మునిగిపోయారు.

బాచేపల్లి ఘటనలో చికిత్స పొందుతూ..

కల్హేర్‌(నారాయణఖేడ్‌): నిజాంపేట్‌ మండలం బాచేపల్లి వద్ద ఈ నెల 21న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరో వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. కుటుంబీకులు, బంధువుల కథనం ప్రకారం.. మహరాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా దెగ్లూర్‌కు చెందిన కుటుంబీకులు హైదరాబాద్‌లోని శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి స్కార్పియో వాహనంలో వెళ్తున్నారు. ఈ క్రమంలో బాచేపల్లి వద్ద డివైడర్‌ను ఢీకొట్టగా షమీమ్‌బేగం(50), అనాబియా తక్షిం(4), మొహ్మద్‌ నదీమ్‌(30) మరణించిన విషయం విధితమే. మరో 5 మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడి సంగారెడ్డి ఆస్పత్రిలో చేరిన మొహ్మద్‌ నవీద్‌(32)ను అక్కడి నుంచి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement