రోడ్డుపైనే ఇసుక వ్యాపారం | - | Sakshi
Sakshi News home page

రోడ్డుపైనే ఇసుక వ్యాపారం

Jul 25 2026 7:21 AM | Updated on Jul 25 2026 7:21 AM

వట్‌పల్లి(అందోల్‌): రోడ్డు ప్రయాణంలో ఏదేని చిన్న తప్పిదానికి ఎంతోమంది నిండు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు నిత్యం ఏదో ఒక చోట వింటూనే ఉన్నాం. అయినప్పటికీ కొంతమందిలో మార్పు రావడం లేదు. మరోవైపు బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కూడా తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మండల కేంద్రమైన వట్‌పల్లిలో ఇసుక, సిమెంట్‌ ఇటుకల తయారీ వ్యాపారులు ఏకంగా రోడ్లపైనే వ్యాపారం సాగిస్తున్నారు. గొర్రెకల్‌, దేవునూర్‌ గ్రామాల వైపు వెళ్లే ప్రధాన రోడ్లపై ఇసుకను కుప్పలుగా పోసి విక్రయిస్తున్నారు. రాత్రి సమయంలో అటుగీ వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వాహనదారులకు జరిమానాలు విధించే అధికారులు ప్రమాదానికి కారణమయ్యే వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.

పొంచి ఉన్న ప్రమాదం

పట్టించుకోని అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement